
మహిళా శక్తి సంబరాలకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, యాదాద్రి : ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా శక్తి పథకం కింద త్వరలో పెట్రోల్ బంకులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు స్వయం సహాయక సంఘాలు, సీ్త్రనిధి రుణాలు ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సమాఖ్య భవనం నిర్మిస్తామని చెప్పారు. ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, విజిలెన్స్ అధికారి ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
భువనగిరి : నిరుద్యోగ యువతీయువకులు తమ విద్యార్హతల వివరాలను డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పరిశ్రమల జిల్లా మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈఓ శోభారాణితో కలిసి ఆవిష్కరించారు. నిరుద్యోగులు పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలు తెలుస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు