
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
భూదాన్‌పోచంపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్‌సింగ్ సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి, సీనియర్ అధ్యాపకులు హరిప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు జ్యోతి, సాయివర్థన్, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్‌కుమార్, అధ్యాపకులు చందన, శ్రీదేవి, శివశంకర్, స్వాతి, రేణుకదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.