
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులను కొలుస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు. అంతకుముందు ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా అర్చకులు సుప్రభాత సేవ చేపట్టి.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలోఅష్టోత్తర పూజలు నిర్వహించారు.