
ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం
కేతేపల్లి: రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేతేపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతులు చెప్పులు లైన్‌లో పెట్టి ఎరువులు తెచ్చుకునే రోజులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు. రైతులకు సరిపోను ఎరువులు సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించండంలో విఫలమైందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పంటల సాగుకు ముందే మూసీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, నాయకులు బంటు మహేందర్, కొండ సైదులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేచిరుమర్తి లింగయ్య