
చాడ చెరువునూ కొల్లగొట్టారు
మోటకొండూరు మండలం చాడ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలించారు. సదరు వ్యక్తి మూడు దఫాలు 52,500 టన్నుల మట్టికి అనుమతులు పొందాడు. కానీ, అందుకు విరుద్ధంగా ఏప్రిల్, మే మాసాల్లో వెయ్యి టిప్పర్లకు పైనే మట్టి తరలించాడని తెలుస్తోంది. తరించిన మట్టిని కాటేపల్లి– ముస్త్యాలపల్లి మధ్య 40 ఎకరాల భూమి లీజుకు తీసుకుని అక్కడ నిల్వచేశాడు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. తుర్కపల్లి, బీబీనగర్, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, అడ్డగూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గుట్టలు, చెరువుల నుంచి నిత్యం వందల టిప్పర్ల మట్టి తరలిపోతోంది.