
ఇక్కత్ డూప్లికేషన్‌ను అరికట్టాలని వినతి
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ డిజైన్‌ల డూ ప్లికేషన్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను భూదాన్‌పోచంపల్లికి చెందిన పలువురు చేనేత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గుజ రాత్, సూరత్, రాజస్థాన్ కేంద్రంగా పోచంపల్లి ఇక్కత్ డిజైన్‌లను ప్రింటింగ్ చేసి మార్కెట్‌లో అతితక్కువ ధరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల లక్షలాది మంది చేనేత కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుందన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని చేనేత నాయకులు తెలిపారు. అనంతరం బండి సంజయ్‌ను పోచంపల్లి శాలువాతో సన్మానించారు. కార్యక్రజుమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, ప్రధాన కార్యదర్శి ఏలే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.