
రెడ్‌క్రాస్ సేవలను గ్రామాలకు విస్తరించాలి
భువనగిరి: ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను గ్రామాలకు విస్తరించాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ అందజేసిన రక్తం యూనిట్‌లతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు వేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, డివిజన్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్‌రెడ్డి, కోశాధికారి అంజయ్య, పట్టణ కమిటీ చైర్మన్ వెల్లంకి పురుషోత్తంరెడ్డి, డైరెక్టర్లు షేక్ హమీద్ పాష, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎన్‌చారి, కలీల్, తాళ్లపల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు