కొలాబ్‌ ఫైల్స్‌ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా పని సులభం | Sakshi
Sakshi News home page

కొలాబ్‌ ఫైల్స్‌ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా పని సులభం

Published Thu, Dec 7 2023 2:20 AM

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న  నల్లగొండ కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌
 - Sakshi

నల్లగొండ : కొలాబ్‌ ఫైల్స్‌ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా పని సులభతరం అవుతుందని కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌ అన్నారు. ఈ వెబ్‌ అప్లికేషన్‌పై బుధవారం వివిధ శాఖల ఉద్యోగులకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలాబ్‌ ఫైల్స్‌ వాడడం వల్ల కార్యాలయాల్లో పని వేగంగా పూర్తవుతుందని తెలిపారు. మనకు కావాల్సిన డాటాను సమీకరించుకోవడానికి ఈ అప్లికేషన్‌ ఉపయోగపడటం విశేషమన్నారు. కార్యక్రమంలో ఐటీ డైరెక్టర్‌ (ఎన్‌ఐసీ) రాకేష్‌, ఐటీ మేనేజర్‌, (ఎన్‌ఐసీ) హైదరాబాద్‌ ప్రకాష్‌, జిల్లా ఇన్ఫర్‌ మేటిక్స్‌ అధికారి గణపతిరావు సిబ్బంది పాల్గొన్నారు.

ఫ నల్లగొండ కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement