ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 10:26 PM

ఎలిమినేటి కృష్ణారెడ్డి - Sakshi

సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చితో ముగియనుంది. ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై న కృష్ణారెడ్డి పదవీకాలం మార్చిలో ముగియనుండడంతో మరోసారి జిల్లాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు తమకు అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్ద ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మరోసారి అవకాశం కోసం ఎలిమినేటి కృష్ణారెడ్డి కుటుంబం ఎదురు చూస్తోంది.

ఆశావహుల ప్రయత్నాలు

మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, సీనియర్‌ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నేతి విద్యాసాగర్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌ మరికొందరు నాయకులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఈ పదవికి రాష్ట్రం యూనిట్‌గా అభ్యర్థిని ఎంపికచేసే అవకాశం ఉన్నందున అధినేత కేసీఆర్‌ చూపు ఎవరిమీద ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే శాసనసభ ఎన్నికల ముందు వస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థులు ఎంపిక సామాజికవర్గ సమీకరణల మీద ఆధారపడి ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫ ముగియనున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం

ఫ జిల్లాకు మరోసారి అవకాశం దక్కేనా..

Advertisement
 
Advertisement