ఉధృతం.. నిరసన సంతకం | - | Sakshi
Sakshi News home page

ఉధృతం.. నిరసన సంతకం

Dec 8 2025 7:32 AM | Updated on Dec 8 2025 7:32 AM

ఉధృతం

ఉధృతం.. నిరసన సంతకం

8లో

పూత కోసం ఎదురుచూపులు

8లో

న్యూస్‌రీల్‌

అనూహ్య స్పందన వస్తోంది

పేద విద్యార్థులకు తీరని నష్టం

15న భారీ ర్యాలీగా..

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: వైద్య విద్యను ప్రైవేట్‌పరం చే యాలన్న చంద్రబాబు సర్కారు చర్యలను నిరసిస్తూ ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ పిలుపునందుకుని ఇప్పటికే చలో మెడికల్‌ కళాశాల, రణభేరి కార్యక్రమాలు విజయవంతం కాగా కోటి సంతకాల సేకరణ జిల్లాలో జోరుగా జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో లక్ష్యానికి మించి సాగుతోంది.

జిల్లాకు తలమానికంగా.. పేదలకు వైద్య విద్యను చేరువచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో జగన్‌ సర్కారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా శ్రీకారం చుట్టిన 17 వైద్య కళాశాలల్లో పాలకొల్లు రూరల్‌ దగ్గులూరులో నిర్మిస్తున్న కళాశాల ఒకటి. 60 ఎకరాలు సేకరించి రూ.475 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. రూ.83 కోట్లు వెచ్చించి పునాదులు నిర్మించారు. ఎమ్మెల్యే హోదాలో అప్పట్లో నిమ్మల రామానాయుడు తరచూ స్థలం వద్దకు వెళ్లి చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. కూటమి వచ్చాక మంత్రి అయిన నిమ్మల 18 నెలల కాలంలో కళాశాల వైపు కన్నెత్తి చూసింది లేదు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రలు చేయడంతో పేదలకు వైద్య విద్య అందనంత దూరం కానుంది. ఉచిత సూపర్‌ స్పెషాల్టీ సేవలు దూరమవుతాయి. రూ.లక్ష కోట్లు విలువచేసే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి.

పోరుబాటకు ప్రజామద్దతు

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకు సెప్టెంబరులో చలో మెడికల్‌ కళాశాలలు, గత నెలలో రణభేరి కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిగా ప్రజలు తరలివచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోపక్క వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ఉధృతంగా సాగుతోంది.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సంతకాలు చేస్తున్న మహిళలు. చిత్రంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ (ఫైల్‌)

ఆచంట నియోజకవర్గంలో సంతకాలు చేస్తున్న ప్రజలు. చిత్రంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఫైల్‌)

పండ్లలో రారాజుగా ప్రసిద్ధి చెందిన మామిడిపై రైతులు ఆశలు పెట్టుకుని పూతల కోసం ఎదురు చూస్తున్నారు.

పేదలకు మేలు చేయడం మాని మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను ప్రజలు గమనిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జిల్లాలో లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది.

– ముదునూరి మురళీకృష్ణంరాజు,

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడమే. ప్రతిభ ఉన్నా ప్రైవేట్‌ యాజమాన్యాలు అడిగిన కోట్లాది రూపాయలు వెచ్చించి సీట్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వలన పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి.

– ఎడ్వర్డ్‌పాల్‌, తణుకు

పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్‌ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్‌లు కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొంటూ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నారు. నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, ఉండిలో సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు, పాలకొల్లులో సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావులు పార్టీ నేతలతో కలిసి గ్రామ, వార్డుల్లో రచ్చబండలు నిర్వహించి ప్రైవేటీకరణ అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని, ప్రజా నిధులతో నిర్మించిన భవనాలు, ఆస్పత్రులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని, జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యానికి భంగం కలగకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 10న జిల్లా కేంద్రం భీమవరంలో ఉంచి 15న పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అదేరోజున భీమవరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

కోటెత్తుతున్నారు

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌ సీపీ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన

చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు

జిల్లాలో జోరుగా కోటి సంతకాల ఉద్యమం

లక్ష్యానికి మించి సాగుతున్న సంతకాల సేకరణ

ఉధృతం.. నిరసన సంతకం 1
1/4

ఉధృతం.. నిరసన సంతకం

ఉధృతం.. నిరసన సంతకం 2
2/4

ఉధృతం.. నిరసన సంతకం

ఉధృతం.. నిరసన సంతకం 3
3/4

ఉధృతం.. నిరసన సంతకం

ఉధృతం.. నిరసన సంతకం 4
4/4

ఉధృతం.. నిరసన సంతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement