వాసవీ మాత సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
పెనుగొండ: పెనుగొండలో నగరేశ్వర మహిషాసురమర్దనీ, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి టి.మల్లికార్జునరావు, శైలజ దంపతులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చే యించారు. ముందుగా ఈఓ గుబ్బల పెద్దింట్లురావు, అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం అఖిల భారత వాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలో 102 అడుగుల రుషీ గోత్రమందిరాన్ని వారు సందర్శించి, 90 అడుగుల వాసవీ మాతను దర్శించుకున్నారు. మరకత శిల వాసవీ మాతకు పూజలు చేశారు. తహసీల్దార్ జి.అనితకుమారి ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వీరమ్మ పార్కు రైతు బజార్, కొత్త బస్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశంచౌక్, జేపీ రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఫుడ్ కోర్ట్‌ల ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ, కూరగాయల ధరల నియంత్రణ విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వీరమ్మ పార్కులో లైటింగ్ ఏర్పాట్లు చేసి అభివృద్ధి చేయాలన్నారు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు మీ దకు షెడ్డులు నిర్మించి ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. రైల్వే జంక్షన్ ఫ్లై ఓవర్ వద్ద డంపింగ్ చేస్తున్న చెత్తను తొ లగించాలన్నారు. బజారును పరిశీలించి కూరగాయలు ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, ఏసీ పీఎం శ్రీలక్ష్మి, టౌన్ సర్వే ఎస్.రమబాయి ఉన్నారు.
భీమవరం: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) 2025–26 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 12 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 2,835 మంది విద్యార్థులకు 2,559 మంది హాజరయ్యారు. ఆయా కేంద్రాలను అ ధికారులు తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసు లు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్‌ఎంఎంఎస్ 2025–26కు ఏలూరు జిల్లాలో 2,568 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. మొ త్తం 2,654 మంది విద్యార్థులకు గాను 86 మ ంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 12 కేంద్రాల్లో, తాను ఒక కేంద్రంలో తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిపోయిన బాలిక (16)ను పోలీసులు ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలిక ట్రిపుల్‌ఐటీ నుంచి బ యటకు వెళ్లిన తరువాత ఇక్కడి నుంచి నేరుగా విజయవాడలోని కనకదుర్గమ్మవారి ఆలయానికి వెళ్లిందని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. ట్రిపుల్‌ఐటీ అధికారులు ఫిర్యాదు చేయగానే పట్టణ పోలీస్‌స్టేషన్ సిబ్బంది బాలిక ఆచూకీ కోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారమందించి సిబ్బందిని పలు ప్రాంతాలకు పంపించామన్నారు. చదువు విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రశాంతత కోసం అమ్మవారి ఆలయానికి వెళ్లిందని, అక్కడి నుంచి తీసుకొచ్చిన తరువాత కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీఐ చెప్పారు.


