స్క్రబ్ టైఫస్ కలకలం
● ఏలూరు జిల్లాలో మూడు కేసులు
● అవగాహన కల్పించని వైద్యాధికారులు
ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో మూడు కే సులు నమోదు కావటంతో కలకలం రేగింది. అయితే దీనిపై ఏలూరు జిల్లా వైద్యాధికారులు నో రు మెదపటం లేదు. కనీసం ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాజాగా నమోదైన కేసుతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ఏలూరు సర్వజన ఆస్పత్రిలో పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ స్క్రబ్ టైఫస్‌తో చికిత్స పొందింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని వెద్య నిపుణులు చెబుతున్నారు. ఆమె శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇక నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరం, మలబద్దకం సమస్యతో గతనెల 29న నూజివీడు ఏరియా హాస్పిటల్‌లో చేరాడు. ఆయనకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉండటంతో జ్వరం అదుపులోకి రా కపోవటంతో రెండు రోజులక్రితం ఎలీసా టెస్ట్ చేశారు. రిపోర్ట్‌లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. ఆరోగ్యం క్షీణించటంతో మెరుగైన చికి త్స నిమిత్తం విజయవాడ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. బాధితుడి ఇంటి ఆవరణలో పశువుల షెడ్డు, మురుగు ఉండటంతో నల్లిపురుగు వ్యాప్తి చెంది ఉండవచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికే జిల్లాలోని టి.నర్సాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌తో చికిత్స పొందగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.
చిన్నపాటి పురుగు ద్వారా..
స్క్రబ్ టైఫస్ ఒరియంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియాతో మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పొదలు, భారీగా చెట్లు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లుల వంటి పురుగు (చిగర్ మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. ఈ కీటకం మనిషికి తెలియకుండానే కాటు వేయగా శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతు లు, పొడిదగ్గు, నీరసం, కుట్టిన చోట నల్లటి మచ్చ లు, దద్దుర్లు వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం దెబ్బతిని కామెర్లు రావటం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వ్యాధి తీవ్రత ఆధారంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే హృదయకండరాల వాపు, అంతర్గత రక్తస్రావం, తె ల్ల రక్తకణాలు తగ్గిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పతాయని వైద్య నిపుణులు చెబుతున్నా రు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.


