ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ఏలూరు టౌన్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ, ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తితో పే రివిజన్ కమిషన్ వెంటనే వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎస్‌వీ రామకృష్ణారావు, జిల్లా కార్యదర్శి ఎ.బంగారయ్య డిమాండ్ చేశారు. ఏలూరులోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి డీఏలను చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీఆర్‌సీ ఏరియర్స్, ఏళ్ల తరబడి బకాయి ఉన్న సరెండర్ లీవులు, జీపీఎఫ్, ఏపీజీ ఎల్‌ఐ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను మరింత మెరుగైన రీతిలో అప్‌డేట్ చేసి నగదు రహిత వైద్యసేవలు అందించాలని కోరారు. వైద్యారోగ్యశాఖలో చాలాకాలంగా పదోన్నతులు లేవనీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జె.గోవిందరావు, ఏలూరు తా లూకా అధ్యక్షురాలు నీలిమదేవి, వి.పెద్దిరాజు, షేక్ ఖలీల్, పీ.శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వరరావు, ఎన్.శ్రీనివాసరావు ఉద్యోగుల సమస్యలపై మా ట్లాడారు. సమావేశంలో ఏలూరు, భీమడోలు, నూ జివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, కై కలూరు, కొయ్యలగూడెం తాలూక అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


