పర్సంటేజీల బాగోతం
విషాద ఛాయలు
అవినీతి అనంతం
న్యూస్‌రీల్
ఫిరాయింపు కౌన్సిలర్లదే పెత్తనం
నేడు మున్సిపల్ సమావేశం
ఇసుక అక్రమ రవాణా
రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు లారీలను సీజ్ చేస్తున్నా రవాణా ఆగడం లేదు. 8లో u
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నరసాపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన ఆరు నెలలకు నరసాపురం మున్సిపాలిటీకి బదిలీపై వచ్చిన ముఖ్య అధికారి వ్యవహార తీరు మొదటి నుంచీ వివాదంగా మారింది. 1956లో నరసాపురం మున్సిపాలిటీ ఏర్పడగా, మున్సిపాలిటీ చరిత్రలో ఓ ముఖ్య అధికారి చుట్టూ మున్సిపల్ రాజకీయం, భారీ అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఏరికోరి ఆయన్ను ఇక్కడకు తీసుకువచ్చినట్టు ప్రచారం ఉంది. మున్సిపాలిటీకి వైఎస్సార్‌సీపీ ప్రా తినిధ్యం వహిస్తోంది. అయితే తాను ఎమ్మెల్యే మనిషినని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని సదరు అధికారి బహిరంగంగానే అవినీతి సాగి స్తూ.. వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు మున్సిపల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సదరు అధికారి ముడుపుల రూపంలో వసూలు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని ప్రతినెలా ఎమ్మెల్యే కార్యాలయానికి చేర వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి వ్యవహారాలతో చెడ్డ పేరు వస్తుందని కొందరు అనుచరులు ప్రస్తావించినా ఎమ్మెల్యే పట్టించుకోని పరిస్థితి. దీంతో ముడుపుల ఆరోపణలు నిజమేనేమోనని నియోజకవర్గంలో జనసేన వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
బాక్స్ టెండర్ల పనుల్లో గోల్‌మాల్
సదరు అధికారి కనుసన్నల్లో ఏడాదిగా మున్సిపాలి టీ జరుగుతున్న బాక్స్ టెండర్ల పనుల్లో భారీగా గో ల్‌మాల్ జరిగినట్టు తేటతెల్లమైంది. గతేడాది టన్ను రూ.35 వేలకు కొనుగోలు చేసిన చీపుర్లను ఇటీవల రూ.65 వేల చొప్పున 5 టన్నులను చైర్‌పర్సన్‌కుగానీ, కౌన్సిలర్లకు గానీ తెలియకుండా కొనుగోలు చేసి బిల్లు చేసేశారు. సదరు ఫిరాయింపు కౌన్సిలర్ల బినామీల ద్వారా ఈ కొనుగోలు జరిగినట్టుగా తెలుస్తోంది. చెట్లు నరికి అక్రమంగా తరలించి సొమ్ములు చేసుకున్నారు. ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినవి ఈ రెండు అంశాలైనా కూడా ఏడాది కాలంలో బాక్స్ టెండర్ల ద్వారా సుమారు రూ.2.90 లక్షల ప్రజాధనం లూటీ జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గాడి తప్పన పాలన : నరసాపురంలో డంపింగ్ యార్డ్ సమస్యతో 15 రోజులుగా పట్టణంలో చెత్త సేకరణ జరగడం లేదు. రోడ్డు మొత్తం చెత్తకుప్పలుగా మారి, దుర్గంధంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోని దుస్థితి. మరోవైపు ముఖ్య అధికారి వ్యవహార తీరుతో మున్సిపల్ పాలన మొత్తం గాడి తప్పింది. పాలకవర్గం వైఎస్సార్‌సీపీ కావడంతో ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి కక్షపూరిత వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయాలు పట్టణంలో వ్యక్తమవుతున్నాయి.
గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందడంతో అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. 8లో u
మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పీఎఫ్ రుణం కోసం ఫైల్‌ను ముఖ్య అధికారి వద్దకు తీసుకువెళ్లగా.. రూ.2 లక్షల రుణంలో 10 శాతం కమీషన్ రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా గత్యంతరం లేక సదరు ఉద్యోగి ఇచ్చిన పరిస్థితి.
ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల సమయంలో వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సెలవు కావాలని అభ్యర్థించగా.. డబ్బులు డిమాండ్ చేయడంతో ఒక్కొక్కరూ రూ.20 వేలు సమర్పి ంచుకున్నారు.
పట్టణంలో రూ.లక్ష ల్లో ఆస్తి బకాయి ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని వద్ద రూ.1,500 తీసుకుని నిబంధనలు మీరి పారిశుద్ధ్య సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి ఇచ్చారు.
పట్టణంలో బిల్డింగ్ ప్లాన్‌కు అప్రూవల్ రావాలంటే నిర్మాణ వ్యయాన్ని బట్టి పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదంటే సదరు అధికారి చాంబర్ చుట్టూ నెలల తరబడి తిరగాల్సిందే.
పట్టణంలో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు బిల్లులు కావాలంటే 10 శాతం వాటా ఇవ్వాల్సిందే.
ప్రజలు ఏదైనా సంతకం కోసం కార్యాల యానికి వచ్చినా టెన్ పర్సెంట్ వాటా ఇవ్వ నిదే పని జరగని దుస్థితి. కనీసం రూ.500 అయినా ఇవ్వకుంటే సంతకం అసంభవం.
చివరకు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయాలన్నా ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి.
చేయి తడపాల్సిందే
ఎమ్మెల్యే మనిషినంటూ అవినీతి తాండవం
ఏ ఫైల్ కదలాలన్నా 10 శాతం ఇవ్వాలిందే..
సొంత శాఖ ఉద్యోగులపైనా కనికరం లేదు
నరసాపురం మున్సిపాలిటీలో ముఖ్య అధికారి లీలలు
ఇద్దరు ఫిరాయింపు కౌన్సిలర్లతో వ్యవహారాలు ?
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన ఇద్దరు ఫిరా యింపు కౌన్సిలర్లు ముందుండి నడిపిస్తుండ గా, ముఖ్య అధికారి మొత్తం వ్య వహారం సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవ ల మోంథా తుపానుతో పట్టణంలో నేలకొరిగిన చెట్లను అక్రమంగా తరలించడం, గోదావరి గట్టున లేని చెత్తను ఎత్తినట్టు చూపించి రూ.లక్షల్లో బిల్లులు చేసుకోవడం, పట్టణంలో ఎక్కడ కట్టడాలు జరుగుతున్నా.. భవన యజమానులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, అక్రమ లేఅవుట్లకు ఆసరాగా నిలవడం, చివరకు డ్రెయిన్లలో సిల్టు తీయకుండా పనులు చేసినట్టు బిల్లులు దండుకోవడం ఇలా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి కోకొల్లలు.
చెట్లు అక్రమ నరికివేత, బాక్స్ టెండర్ల కుంభకోణం అంశాలతో మున్సిపల్ సాధారణ సమావేశం అజెండా ఆమోదం కాకుండా రెండుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
పర్సంటేజీల బాగోతం
పర్సంటేజీల బాగోతం


