ఎయిడ్స్‌ను పారదోలుదాం
భీమవరం (ప్రకాశంచౌక్): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1,500 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని, కొత్తగా వ్యాధి సోకకుండా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. బాధితులు క్రమం తప్పకుండా మందులను వాడాలని, చికిత్సకు సహకరించాలని కోరారు. ఎయిడ్స్, హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష తగదన్నారు. అదనపు డీఎంహెచ్‌ఓ రవిబాబు, డీసీహెచ్‌ఎస్ పి.సూర్యనారాయణ, హాస్పిటల్ పర్యవేక్షకుడు లక్ష్మణ్ జీతనాంద్, ఏఆర్‌టీ సెంటర్ కౌన్సిలర్ నాగరాజు, ప్రభుత్వ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కా ర్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులు ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 13 మంది ఫిర్యాదులు అందించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లు వేగిరపర్చాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. భీమవరం మున్సిపాలిటీలో సోమవారం ఆయ న సమీక్షించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను వ సూలు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, ఈ–ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై సమీక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో పన్ను, పన్నేతర వసూళ్లను సకాలంలో పూర్తిచేసి ఆదాయం పెంచాలన్నారు. పారిశుద్ధ్య పురోగతిపై సమీక్షించి పట్టణంలో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని నూరుశాతం ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే పీజీఆర్‌ఎస్, పురమిత్ర ఫిర్యాదులను సకాలంలో సరైన పద్ధతులు పరిష్కరించాలన్నారు. క మిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆర్‌ఐలు, మున్సిపల్ హెల్త్ అధికారి పాల్గొన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయం చేశారని మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ట్రిబ్యునల్ తీర్పులు, కౌన్సిల్ తీర్మానాల అమలు కోసం స్కూల్స్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేశారు. సోమ య్య మాట్లాడుతూ నెలంతా పనిచేస్తే ఒక స్కూల్ స్వీపర్‌కు రూ.4 వేలు, స్కూల్ శానిటేషన్ వర్కర్‌కు రూ.6 వేలు ఇవ్వడం దారుణమన్నారు. స్కూలు స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల శ్రమను గుర్తించి ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాలు అమలు చేసి ఫుల్ టైం వర్కర్‌గా గుర్తించాలని, జీఓ 7 ప్రకారం రూ.15,000 కనీస వేతనాలు ఇవ్వాలన్నారు.
ఎయిడ్స్‌ను పారదోలుదాం
ఎయిడ్స్‌ను పారదోలుదాం


