వైఎస్సార్ సీపీ యూత్ వింగ్‌కు జిల్లా నుంచి ఇద్దరు
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు రాష్ట్ర పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కందుల దినేష్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే ఏలూరు నియోజకవర్గానికి చెందిన గేదెల సూర్యప్రకాష్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ యూత్ వింగ్‌కు జిల్లా నుంచి ఇద్దరు


