అదుపు తప్పి ఆటో బోల్తా
తణుకు అర్బన్: ఆటో అదుపు తప్పి ఓ సైక్లిస్టును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తేతలి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తణుకు బ్యాంక్ కాలనీలోని గుఱజాడ స్కూలుకు మండలంలోని ముద్దాపురం గ్రామం నుంచి ఆటో బయలుదేరింది. ఇందులో 9 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి సైకిల్‌పై వెళ్తున్న సత్యనారాయణను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు, ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థిని తిరుపతిపాటి ఆకాంక్షకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన విద్యార్థులను యాజమాన్యం మరొక వాహనంలో పాఠశాలకు పంపించారు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ దండు అశోక్‌వర్మ, తణుకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా ప్రాంతంతోపాటు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ దివ్యాంగుడు కాగా ఇతనికి డ్రైవింగ్ లైసెన్సు లేదన్నారు. ఎడమకాలు పనిచేయకపోయినప్పటికీ ఆటో నడుపుతున్నాడని దీంతో అదుపు తప్పిన ఆటో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆకాంక్ష
తీవ్రంగా గాయపడ్డ సైక్లిస్టు సత్యనారాయణ
సైక్లిస్టుకు, విద్యార్థినికి గాయాలు
అదుపు తప్పి ఆటో బోల్తా


