తుపాను బాధితులను ఆదుకోవాలి
నరసాపురం రూరల్: తుపాను బాధితులందరినీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నా రు. గురువారం మండలంలోని చినమైనవానిలంకలో నల్లీక్రీక్‌పై ఉన్న బ్రిడ్జి కోతకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేనంతగా ఆక్వా రైతులకు భారీ నష్టం కలిగిందని, ఆక్వాతో పాటు అన్ని పంటల రైతులకు సకాలంలో నష్టపరిహారా న్ని అందించి ఆదుకోవాలని కోరారు. నిత్యం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు నల్లీక్రీక్‌పై వంతెన కోతతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలన్నారు. పలువురు ఆక్వా రైతులు ఆరుగాలం కష్టించిన తమ పంట నీటిపాలైందని ప్రసాదరాజు వద్ద వాపోయారు. పార్టీ నాయకులు తిరుమాని నాగరాజు, మైల వీర్రాజు, ఉంగరాల రమేష్‌నాయుడు, అండ్రాజు చల్లారావు, కడలి రాంబాబు, దొంగ మురళీ, కంకటాల పెద్దిరాజు తదితరులు ఉన్నారు.


