మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: కార్తీకమాసం గురువారం, సప్తాహ మహోత్సవాలు ఏడవ రోజు సందర్భంగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతఃకాలార్చన, వేదపారాయణం, నిత్యహోమ బలీహారణాలు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో జరిపారు. అనంతరం ఉపాలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం మహాశాంతి హోమం, దర్భారుసేవ తదితర పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా ద్వారా రూ.1,11,650 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం స్వామివారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి శ్రీ స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచారి, రిషికేష్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు ఘనంగా జరిపించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు పేరిచర్ల జగపతి రాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, కూచిపూడి రమేష్, కానూరు శ్రీనివాస్, వాసవి సాయి నగేష్, ఏలూరి ఫణికుమార్, కర్పూరం కృష్ణారావు, దార చక్రవర్తి, సుబ్రహ్మణ్యం, దార రవీంద్ర, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు గురువారం సంఘం జిల్లా నాయకులు తెలిపారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల నందు నవంబర్ 1 వ తేదీన ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు డివిజనల్ స్థాయిలో ఎంపికై న వారు మాత్రమే ఈ ఎంపికలో పాల్గొనాలన్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులు నేరుగా జిల్లా ఎంపికల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. వివరాలకు 99597 96929 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు


