
మంత్రి నియోజకవర్గంలో కొరత
తొలకరి సీజన్‌లో నీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నియోజకవర్గంలోనూ సమస్య అధికంగా ఉంది. యలమంచిలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర తదితర ఎనిమిది మండలాల్లో నారుమడులు బీటలు తీశాయి. గోదావరికి వరద పోటెత్తుతుంటే సాగునీటి ఎద్దడి ప్రభుత్వ వైఫల్యమే.
– జేఎన్‌వీ గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి
శివార్లలో తీవ్ర ఎద్దడి
సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పంట కాలువ శివారు ప్రాంతాలకు నీరు అందడం లేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. నారుమడులు నెర్రలు తీసి ఎండిపోయే పరిస్థితి ఏర్పడి తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలి.
– కుడిపూడి శ్రీనివాస్, రైతు, చినమల్లం
రైతులు నష్టపోతున్నారు
తొలకరి ప్రారంభంలోనే తీవ్ర సాగునీటి పరిస్థితులు ఉన్నాయి. నారుమడులు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు సాగితే నవంబర్, డిసెంబర్‌లో వచ్చే తుపానులతో నష్టపోవడం ఖాయం. అలాగే దాళ్వా ఆలస్యమై రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
– మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

మంత్రి నియోజకవర్గంలో కొరత

మంత్రి నియోజకవర్గంలో కొరత