రెడ్‌బుక్‌ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు

Jul 19 2025 1:09 PM | Updated on Jul 19 2025 1:09 PM

రెడ్‌బుక్‌ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు

రెడ్‌బుక్‌ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు

పెనుగొండ: ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలనతో ప్రజాస్వామ్యం పీక నొక్కుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు వి మర్శించారు. శుక్రవారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆచంట నియోజకవర్గస్థాయి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముదునూరి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కూటమి ఏడాది పాలనలో సంక్షేమాన్ని మరిచి ప్రశ్నించిన వారిపై 4,500 కేసు లు నమోదు చేశారన్నారు. రూ.18,500 కోట్ల విద్యు త్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఎన్నికల సమయంలో సంపద సృష్తించి సంక్షేమం నా లుగు రెట్లు అమలు చేస్తామని బ్యాండ్లు ఇచ్చి, ఇప్పుడేమో సంపద ఎలా ఉందో సృష్టించాలో చెప్పాలంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, యు వత, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్నివర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అలాగే గత జగన్‌ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. ఇంటింటికీ రేషన్‌ అందించే ఎండీయూ వాహనాలను మూలకు చేర్చారన్నా రు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించడం మరిచి పోయారన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్ర తి గడపకూ తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

అడుగడుగునా దోపిడీ

మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ సంక్షేమం అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకుండా, వనరులు దోచుకోవడంపై దృష్టి పెడుతోందని విమర్శించారు. అడుగడుగునా దోపిడీ కి పాల్పడుతున్నారన్నారు. పొలాలకు నీరు సరఫరా, రైతులకు ధాన్యం సొమ్ముల చెల్లింపులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.

పింఛన్లకు తిలోదకాలు

నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకు డు ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ కూటమి పాలకులు కొత్త పింఛన్ల మంజూరుకు తిలోదకాలు ఇచ్చి ఆరు లక్షల పింఛన్లు నిలిపి వేశా రన్నారు. చంద్రబాబు వంచనను మండల, గ్రామస్థాయిలో ప్రతి ఇంటా వివరించాలన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశామని, కూటమి పాలనలో ఒక్కరికై నా ఇంటి స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు. కార్యకర్తలు భయపడాల్సిన పని లేద ని, రాబోయేది జగన్‌ ప్రభుత్వమే అన్నారు.

చంద్రబాబు వంచనను ఎండగట్టాలి

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి ప్రజలను మరోసారి మోసగించారని, చంద్రబాబు వంచనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఆయా వర్గాలకు నామినేటేడ్‌ పోస్టుల్లో 50 శాతం పదవులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయిస్తే నేడు దానిని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, ఎంపీపీలు సబ్బిటి సుమంగళి, కేవీవీ నారాయణ రెడ్డి(వాసు), జెడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణీ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, పిల్లి నాగన్న, గూడూరి దేవేంద్రుడు, జక్కంశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం

ప్రశ్నించిన వారిపై 4,500 కేసులు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement