
శానిటేషన్ మేస్త్రి, వర్కర్ ఆత్మహత్యాయత్నం
నూజివీడు: నూజివీడు మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి దూషించారంటూ పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేసే శానిటేషన్ మేస్త్రి దలాయి కొండలరావు, శానిటేషన్ కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్న ఆయన భా ర్య పైడమ్మ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఉదయం 9 గంటల సమయంలో ఇంటి వద్ద నిద్రమాత్రలు మింగగా కుటుంబసభ్యులు, స్థానికులు వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం
భీమవరం (ప్రకాశంచౌక్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో తప్పక నిర్వహించాలని, ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు 23న ఇంటర్వ్యూలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈనెల 23న భీమవరంలోని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు మొదలవుతాయని, సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల యల మంచిలిలో ఇంగ్లిష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల వీరవాసరంలో కెమిస్ట్రీ, కామర్స్, ప్రభు త్వ జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెంలో మేథమెటిక్స్, ఎస్‌సీఐఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల తణుకులో కామర్స్, ఎస్‌సీఐఎం జూనియర్ కళాశాల తణుకు సీఈటీలో బీటెక్ సివిల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల దుంపగడపలో బోటనీ, జువాలజీ, ప్రభుత్వ జూని యర్ కళాశాల గరల్స్ పాలకొల్లులో కెమిస్ట్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల అత్తిలిలో మేథమెటిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
పాత పెన్షన్ అమలు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోందని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో తెలిపారు.