
ఉద్యోగులు బాధ్యతలు గుర్తెరగాలి
తాడేపల్లిగూడెం రూరల్: ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరగాలని వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణుమాధవరావు అన్నారు. ఆదివారం స్థానిక వ్యవసాయ శాఖ సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు మాట్లాడుతూ ఏఈవోల న్యాయమైన డిమాండ్ల కోసం ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్‌తో కలిసి పోరాడుతున్నామన్నారు. ఏఈవోలకు జాబ్‌చార్ట్, పేరు మార్పు, పదోన్నతుల స్కేల్ తదితర డిమాండ్ల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఏఈవోలుగా పదోన్నతి చెందిన సభ్యులకు వ్యవసాయ విస్తరణాధికారుల సంఘంలో సభ్యత్వం కల్పించారు. జిల్లా అధ్యక్షుడు నెక్కంటి రాంబాబు, కార్యదర్శి ఎండిఆర్ శివప్రసాద్, కోశాధికారి బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.