కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి

Published Sun, Jun 16 2024 12:08 AM | Last Updated on Sun, Jun 16 2024 12:10 AM

కేంద్

ఏలూరు (టూటౌన్‌): ప్రజా అనుకూల విధానాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ పిలుపు నిచ్చారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభ అనంతరం వేలాది మంది రైతు కూలీలు, ఆదివాసీలతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సాయంత్రం 3 గంటలకు స్థానిక టుబాకో మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలు నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఫ్‌లైఓవర్‌, కెనాల్‌ రోడ్‌, అంబికా సెంటర్‌, మెయిన్‌ బజార్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ నూతనంగా అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఆదివాసీలను అడవుల నుంచి తరిమేసే విధానాల పట్ల పాలకులు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకులు ఎవరైనా కార్పొరేట్‌, సామ్రాజ్యవాదులకు అనుకూల విధానాల్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు వెంటనే సమగ్ర శాసీ్త్రయ పరిహారం, పునరావాసం కల్పించాలన్నారు. ఏఐఎస్టీయు(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌ బాబు మాట్లాడుతూ కార్మికులు, రైతులు ఐక్యంగా రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీ్త్ర విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు చల్లపల్లి విజయ మాట్లాడుతూ రైతు కూలీ, పేద మహిళలపై గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య, పెత్తందారీ శక్తులు సాగిస్తున్న అత్యాచారాలు, దాడులను తీవ్రంగా ఖండించారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంటున్న పాలకుల విధానాలపై సమష్టి పోరాటాలు సాగించాలన్నారు. ఈ సభలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ, తెలంగాణ నాయకులు ప్రసాదన్న, బిహార్‌ నాయకులు అశోక్‌ బైతా, పీడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి ఏ.సురేష్‌, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. మహాసభల సందర్భంగా శనివారం సాయంత్ర ఏలూరు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. ఆదివాసీల సంప్రదాయ నృత్యం, ప్రజా కళాకారుల డప్పు నృత్యాలు అలరించాయి. పోలవరం నిర్వాసితులతో పాటు, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు కూలీ పేదలు ఎర్రజెండాలు చేబూని, నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్‌ నాగరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సభా వేదికపై విప్లవ ఉద్యమ అమర వీరుల త్యాగాల గురించి గానం చేస్తూ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి
1/2

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి
2/2

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి

Advertisement
 
Advertisement
 
Advertisement