లోపాలు లేకుండా పక్కా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

లోపాలు లేకుండా పక్కా ఏర్పాట్లు

Published Fri, May 31 2024 1:18 AM

లోపాలు లేకుండా పక్కా ఏర్పాట్లు

భీమవరం (ప్రకాశంచౌక్‌): కౌంటింగ్‌ ఏర్పాట్లలో లోపాలు లేకుండా ఒకటీకి, రెండు సార్లు సరిచూసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ రిటర్నింగ్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో గురువారం సమావేశమై కౌంటింగ్‌ ఏర్పాట్లపై పునఃసమీక్షించారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బంది విధులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేసుకున్నామని, అలాగే నియోజకవర్గాల స్థాయిలో రెండో ర్యాండమైజేషన్‌, కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణా తరగతులను జూన్‌ 2వ తేదీన పూర్తిచేయాలని ఆదేశించారు. సెల్‌ఫోన్‌లను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతి లేదని ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి డిపాజిట్‌ చేయాలని సూచించారు. కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం సంబంధిత కౌంటింగ్‌ సెంటర్‌ నుండి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నేరుగా జిల్లా ఈవిఎం గోడౌన్‌ కు తరలించాలని ఆదేశించారు. జేసీ సీవీ ప్రవీణ్‌ ఆదిత్య, డీఆర్వో జె.ఉదయ భాస్కరరావు, ఆర్వోలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement