కౌంటింగ్‌కు సిద్ధం | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు సిద్ధం

Published Fri, May 31 2024 1:18 AM

కౌంటి

గుంటుపల్లి బౌద్ధారామాలు
కామవరపుకోట మండలంలో గుంటుపల్లిలో బౌద్ధారామాలు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. 8లో u
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్‌ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలో.. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శ్రీవిష్ణు కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆయా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

విషపుటీగల దాడి

నరసాపురం మండలం గొంది గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న సమయంలో విషపుటీగలు దాడి చేయడంతో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. 8లో u

శురకవారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2024

సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ గాంధీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది. అదే ఒరవడితో కౌంటింగ్‌ ప్రక్రియను కూడా విజయవంతం చేసే పనిలో నిమగ్నమైంది. పోలింగ్‌ అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆచంట నియోజకవర్గాల ఈవీఎంలను శ్రీవిష్ణు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. ఈ రెండు విద్యాసంస్థల్లోనే కౌంటింగ్‌కు కూడా చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్‌ పక్కపక్కనే వేర్వేరు హాళ్లలో, మిగిలిన నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్‌లకు పెద్దపెద్ద హాళ్లను రెండుగా విభజించారు. పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం విష్ణు కళాశాలలో ఒక హాల్‌ను సిద్ధం చేశారు. కౌంటింగ్‌ జరిగే ఆయా హాళ్ల వద్ద కౌంటింగ్‌ స్టాఫ్‌ మినహా ఇతర సిబ్బంది, ఏజెంట్లు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా బ్యారీకేడ్లు, ఇనుప మెస్‌లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రౌండ్‌కు 14 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు లెక్కించేందుకు వీలుగా ఒక్కో హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కోసం పార్లమెంట్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు సిద్ధం చేసిన హాళ్లను ఇప్పటికే పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు పరిశీలించారు. కౌంటింగ్‌ స్టాఫ్‌ మెస్‌ లోపల ఉండి ఈవీఎంలలో పోటీలోని అభ్యర్థులకు పోలైన ఓట్లను మెస్‌ వెలుపల ఉన్న వారివారి ఏజెంట్లకు చూపిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు.

సిబ్బందికి శిక్షణ పూర్తి

ఒక్కో నియోజకవర్గానికి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలతో పాటు కౌంటింగ్‌కు ఒక్కో టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తారు. వీరితో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ తదితరులు కలిపి 1500 మంది వరకు సిబ్బంది కౌంటింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. కౌంటింగ్‌ విధివిధానాలపై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ కౌంటింగ్‌ స్టాఫ్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు తొలి ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. కౌంటింగ్‌ తీరుతెన్నులపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించారు.

కౌంటింగ్‌ కేంద్రాలకు పటిష్ట భద్రత

రెండు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ డాక్టర్‌ అజిత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర, ప్రత్యేక బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

అభ్యర్థులు, కౌంటింగ్‌ సిబ్బంది, ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారు, ఎలక్షన్‌, కౌంటింగ్‌ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. కౌంటింగ్‌ ఆవరణకు కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేయనున్నారు.

న్యూస్‌రీల్‌

కౌంటింగ్‌ జరిగేదిక్కడే..

ఆచంట

అసెంబ్లీ: శ్రీమతి బి.సీత పాలిటెక్నిక్‌ కాలేజీ, సెకండ్‌ ఫ్లోర్‌, రూమ్‌ నంబర్‌ 310, సెమినార్‌ హాల్‌

పార్లమెంట్‌: శ్రీమతి బి.సీత పాలిటెక్నిక్‌ కాలేజీ, సెకండ్‌ ప్లోర్‌, రూమ్‌ నంబర్‌ 313, సెమినార్‌ హాల్‌

పాలకొల్లు

అసెంబ్లీ: శ్రీమతి బి.సీత పాలిటెక్నిక్‌ కాలేజీ, సెకండ్‌ ప్లోర్‌, డ్రాయింగ్‌ హాల్‌–1

పార్లమెంట్‌: శ్రీమతి బి.సీత పాలిటెక్నిక్‌ కాలేజీ, సెకండ్‌ ప్లోర్‌, డ్రాయింగ్‌ హాల్‌–2

నరసాపురం

అసెంబ్లీ, పార్లమెంట్‌ : శ్రీవిష్ణు ఫుడ్‌ ప్లాజా–1, డైనింగ్‌ హాల్‌

తణుకు

అసెంబ్లీ, పార్లమెంట్‌: ఉమెన్‌ ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్ట్‌, శ్రీవిష్ణు స్కూల్‌ గ్రౌండ్‌

భీమవరం

అసెంబ్లీ, పార్లమెంట్‌: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, సెకండ్‌ ఫ్లోర్‌, యూ బ్లాక్‌, సిల్వర్‌ జూబ్లీ బిల్డింగ్‌, డ్రాయింగ్‌ హాల్‌

ఉండి

అసెంబ్లీ, పార్లమెంట్‌: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఎన్‌–101

తాడేపల్లిగూడెం

అసెంబ్లీ, పార్లమెంట్‌: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, థర్డ్‌ ప్లోర్‌, యూ బ్లాక్‌, సిల్వర్‌ జూబ్లీ బిల్డింగ్‌, డ్రాయింగ్‌ హాల్‌

పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌

విష్ణు ఫార్శశీ కళాశాల లైబ్రరీ రీడింగ్‌ రూమ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

‘ఎస్‌ఆర్‌కేఆర్‌’లో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం..

‘విష్ణు’లో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు

విష్ణులోనే పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

14 టేబుళ్లతో సిద్ధమైన కౌంటింగ్‌ హాళ్లు

విధుల్లో 1500 మంది వరకు సిబ్బంది

కట్టుదిట్టంగా మూడంచెల భద్రత

కౌంటింగ్‌కు సిద్ధం
1/1

కౌంటింగ్‌కు సిద్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement