25న గురుకుల ప్రవేశ పరీక్ష | Sakshi
Sakshi News home page

25న గురుకుల ప్రవేశ పరీక్ష

Published Thu, Apr 18 2024 1:45 PM

-

ముసునూరు: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు, ఏలూరు జిల్లా కన్వీనర్‌, ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్‌ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, 5, 6, 7, 8 తరగతులు, ఏపీఆర్‌ఎస్‌ కాట్‌–2024 విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలకు వరకు ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌–2024 విద్యార్థులకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, పోస్ట్‌ ద్వారా ఇంటికి పంపడం ఉండదని అభ్యర్థులకు ఆమె సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement