తీరంలో పర్యాటక శోభ | Sakshi
Sakshi News home page

తీరంలో పర్యాటక శోభ

Published Fri, Nov 17 2023 12:58 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓ వైపు అటవీ ప్రాంతం, మరోవైపు గోదావరి అందాలు.. ఇంకో వైపు సముద్ర తీరం కలిసి ఉన్న ఏకై క జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి. జిల్లాలో ఏకై క బీచ్‌గా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి పొందిన మొగల్తూరు పేరుపాలెం బీచ్‌ మరోమారు బీచ్‌ ఫెస్టివల్‌కు సిద్ధమవుతుంది. జనవరి రెండో వారంలో బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. 2020లో శ్రీకారం చుట్టగా కోవిడ్‌ పరిస్ధితులతో మూడేళ్లుగా జరగలేదు. 2024 సంవత్సరం జనవరిలో ఘనంగా నిర్వహించనున్నారు.

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు ఏటా లక్షల్లో సందర్శకులు వస్తారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బ్లూఫాగ్‌ గుర్తింపు యత్నాలు తుదిదశకు చేరాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో మొదటి సారి పేరుపాలెం బీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మూడురోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రతీ ఏటా ఒక్క కార్తీక మాసంలోనే పేరుపాలెం బీచ్‌ను 3 లక్షలు మంది వరకూ సందర్శిస్తారు. ఇక వారాతంరాలు, సెలవు దినాలు, పండుగల సమయంలో ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తారు.

నాడు బీచ్‌ అభివృద్ధికి వైఎస్సార్‌ బీజం

2006 ముందు వరకు పేరుపాలెంకు కనీసం గుర్తింపు లేని తరుణంలో దివంగత వైఎస్సార్‌ బీచ్‌ అభివృద్ధికి బీజం వేశారు. 2006లో మెట్టిరేవు, మోళ్లపర్రు మీదుగా 3.50 కిలోమీటర్లు మేర బీచ్‌రోడ్డుకు రూ 2.86 కోట్లు మంజూరు చేయడంతో వెంటనే రోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి బీచ్‌కు సందర్శకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

బ్లూఫాగ్‌ బృందం పర్యటన

2020 ఫిబ్రవరిలో పేరుపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, అటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ బీచ్‌లతో పాటుగా పేరుపాలెం బీచ్‌కు బ్లూఫాగ్‌ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 2020 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్లూఫాగ్‌ బృందం తీరంలో పర్యటించింది. పర్యాటకంగా అభివృద్ధిద చేసేందుకు బీచ్‌లు అనుకూలంగా ఉన్నాయని బృందం సభ్యులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. విశాఖ ఎ– గ్రేడ్‌గా, కాకినాడ, పేరుపాలెం బీచ్‌లు బీ–గ్రేడ్‌గా బ్లూఫాగ్‌ గుర్తింపునకు ఎంపికయ్యాయి. గుర్తింపు లభించిన వెంటనే బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏడాదికి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకూ నిధులు మంజూరవుతాయి.

కేరళ కోవలం బీచ్‌ తరహాలో

కేరళలోని కోవలం బీచ్‌ను తలదన్నే అందాలు పేరుపాలెం బీచ్‌ సొంతం. బీచ్‌లో చుట్టుపక్కల కొబ్బరి తోటలు, సరుగుడు తోటలు ఉన్నాయి. మేరీమాత ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, మత్స్యనారాయణస్వామి ఆలయాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి. భీమవరం, నరసాపురం ప్రాంతాల నుంచి బీచ్‌ రోడ్డు అనుసంధానంగా పలు రహదారుల నిర్మాణాలకు రూ.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు కొన్ని ప్రారంభమయ్యాయి. బీచ్‌లో రాష్ట్ర టూరిజం శాఖ ఇప్పటికే రిసార్ట్స్‌ నిర్మించింది. వీఐపీ గెస్ట్‌హౌస్‌ నిర్మించారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రాబోయే 5 ఏళ్లలో రూ.40 కోట్లతో హోటల్స్‌, రిసార్ట్స్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. పేరుపాలెం బీచ్‌ నుండి కేపీపాలెం బీచ్‌ వరకు ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిని రూ.3 కోట్లతో డబుల్‌ రోడ్డుగా నిర్మించారు. ముత్యాలపల్లి, మోడీ వయా పేరుపాలెం బీచ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్ల కేటాయింపు, మెట్రేవు, అల్లంవారి మెరక మీదుగా పేరుపాలెం బీచ్‌ రోడ్డుకు రూ.8 కోట్లు కేటాయింపు, బియ్యపుతిప్ప, వేములదీవి, చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాల నుంచి పేరుపాలెం బీచ్‌ను కలుపుతూ రూ.4.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వైస్సార్‌ స్మృతివనం

2020లో జరిగిన బీచ్‌ ఫశ్రీస్టివల్‌లో పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లను వైఎస్సార్‌ బీచ్‌లుగా ప్రభుత్వం అధికారకంగా నామకరణం చేసింది. ప్రస్తుతం కేపీపాలెం బీచ్‌లో మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి 20 అడుగుల కాంస్యం విగ్రహం ఏర్పాటుతో పాటు ఆయన జీవిత విశేషాలను తెలియచేసేలా రూ.కోటి వ్యయంతో మ్యూజియం, స్మృతి వనం పనులు జరుగుతున్నాయి..

టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్‌

జనవరిలో పేరుపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌

ఇప్పటికే ఈ బీచ్‌కి బ్లూఫాగ్‌ గుర్తింపు

బీచ్‌ అభివృద్ధిలో నాడు వైఎస్‌.. నేడు జగన్‌ ముద్ర

బ్లూఫాగ్‌ గుర్తింపు వస్తే మరిన్ని నిధులు

పేరుపాలెం బీచ్‌కు బ్లూఫాగ్‌ గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. బ్లూఫాగ్‌ బృందం స్థానికంగా పర్యటించింది. దేశంలోని ముంబయి, చైన్నె లాంటి ప్రముఖ బీచ్‌ల జాబితాలో పేరుపాలెం చేరుతుంది. నిధులు వస్తే బీచ్‌ను మరింతగా అభివృద్ధి చేయొచ్చు.

– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌

2020లో జరిగిన బీచ్‌ ఫెస్టివల్‌లో  సందర్శకులతో కిటకిటలాడుతున్న పేరుపాలెం బీచ్‌(ఫైల్‌)
1/3

2020లో జరిగిన బీచ్‌ ఫెస్టివల్‌లో సందర్శకులతో కిటకిటలాడుతున్న పేరుపాలెం బీచ్‌(ఫైల్‌)

వేగంగా సాగుతున్న వైఎస్సార్‌ స్మృతివనం పనులు
2/3

వేగంగా సాగుతున్న వైఎస్సార్‌ స్మృతివనం పనులు

3/3

Advertisement
 
Advertisement