విద్యా సంస్థల బస్సుల తనిఖీ | Sakshi
Sakshi News home page

విద్యా సంస్థల బస్సుల తనిఖీ

Published Fri, Nov 10 2023 1:08 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రవాణా శాఖ అధికారులు గురువారం ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో బస్సులు తనిఖీ చేశారు. 43 కేసులు నమోదు చేశారు.

సర్కారు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం

పేదలకు ఖరీదైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

2లో u

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ చూడండి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో రూ.వేల కోట్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహాయజ్ఞంలా సాగాయి. సంక్షేమ సారథి జగన్‌మోహన్‌రెడ్డికే పట్టంకట్టాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకులో పౌరసరఫరాల శాఖామంత్రి కారుమూరి నాగేశ్వరరావు, నర్సాపురంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రారంభించారు.

నాలుగున్నరేళ్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నూరు శాతం అమలు చేసి వృద్ధిరేటులో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నాడు–నేడు, రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌తో పాటు అనేక అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున సాగాయి. ఈ క్రమంలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌‘ కార్యక్రమం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఏం చేసింది.. ప్రజలకు తెలియచేయడంతో పాటు సచివాలయాల వద్ద అభివృద్ధి బోర్డుల ఆవిష్కరణ, పార్టీ జెండాల ఆవిష్కరణ, సచివాలయాల్లోని ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఏలూరు జిల్లాలో..

నూజివీడు పట్టణంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించి సమావేశంలో ప్రసంగించారు. నూజివీడులోని అన్ని మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. కై కలూరు మండలం ఆటపాక, వడాలి సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గం దెందులూరు మండలం జోగన్నపాలెం, పెదవేగి మండలం కొప్పాక, ఏలూరు రూరల్‌ మండలం పైడిచింతపాడులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యక్రమాన్ని నిర్వహించి సమావేశంలో ప్రసంగించారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం, కుక్కునూరు మండలం మారేడుబాకలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉంగుటూరు నియోజకవర్గం బాదంపూడిలో మండల నాయకులు, గణపవరం మండలం అర్ధవరంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గం ఏలూరులో మోతేవారితోట సచివాలయం–3 పరిధిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎంఆర్‌ పెదబాబు పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌ : తణుకులో బుక్‌లెట్‌లు ఆవిష్కరించిన మంత్రి కారుమూరి, చిత్రంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌ తదితరులు

తాడేపల్లిగూడెం అర్బన్‌: గూడెంలో సంక్షేమ పథకాల వివరాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లాలో..

తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. తణుకు మున్సిపల్‌ కార్యాలయం, మండలంలోని తేతలి గ్రామాల్లో పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా రావాలన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు కార్యక్రమం నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించి సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త గూడాల గోపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆచంట నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు.

సంక్షేమ సారథికే పట్టం కడదాం

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ లాంఛనంగా ప్రారంభం

తాడేపల్లిగూడెం, తణుకులో ప్రారంభించిన మంత్రులు కొట్టు, కారుమూరి

జెండా ఆవిష్కరణలు, అభివృద్ధి, సంక్షేమ బోర్డుల ఆవిష్కరణ

సంక్షేమం అందాలంటే జగనే రావాలి

తణుకు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే... పేదింటి బిడ్డలు ఉన్నతస్థాయి చదువులు చదివి అత్యున్నత స్థాయికి వెళ్లాలన్నా, పేదింట ఖరీదైన వైద్యసేవలు ఉచితంగా అందాలన్నా, వలంటీరు వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మంలోకే పింఛన్లు అందాలన్నా, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా అందాలన్నా, కులమతాలకు అతీతంగా సంక్షేమం అందాలన్నా ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే రావాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో గురువారం ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తణుకు అర్బన్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక పాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఏ గడపలోకి వెళ్లినా మళ్లీ జగనే సీఎంగా రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

మాకు జగన్‌ కావాలి

తాడేపల్లిగూడెం అర్బన్‌: ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అని ప్రజలను అడుగుతుంటే జగనే కావాలని ఎలుగెత్తి చెబుతున్నారని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక కడకట్ల రెండో ఫ్లైఓవర్‌ సమీపంలో జగనన్న సంక్షేమ పథకాల పేర్లతో ఏర్పాటుచేసిన శిలాపలకాన్ని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళినా జగన్‌ మాదిరిగా ఎవరూ సంక్షేమాన్ని అందించలేకపోయారని ప్రజలు చెప్పడం అభినందనీయమన్నారు. సంక్షేమం కొనసాగాలన్నా.. పేదల కుటుంబాల్లో సంతోషం చిరకాలం ఉండాలన్న మళ్ళీ వైఎస్సార్‌సీపీనే గెలవాలని ప్రజలు కాంక్షిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపికే ఓట్లు వేసేందుకు మహిళలు, అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement