బదిలీల కలకలం! | - | Sakshi
Sakshi News home page

బదిలీల కలకలం!

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

వైద్యారోగ్యశాఖలో కేటగిరీ వాళ్లకు దక్కని ప్రాధాన్యం

దూర ప్రాంతాలకు స్పెషల్‌ నీడ్‌ చిల్డ్రన్‌ తల్లిదండ్రుల బదిలీలు

పట్టణంలో ఉన్నవారికి ఇక్కడే పోస్టింగ్‌

గ్రామీణ ప్రాంతాల వారికి తప్పని ఎదురుచూపులు

న్యాయం చేయాలంటున్న బాధిత ఉద్యోగులు

సాక్షి, వరంగల్‌: వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్ర క్రియ అపహాస్యం పాలవుతోంది. స్పౌజ్‌ కేసులు, దివ్యాంగులు, మానసిక వికలాంగుల పిల్లలు ఉన్న ఉద్యోగులు, వితంతువులు తదితర కేటగిరీల వారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జీఓ నంబర్‌ 38 చెబుతున్నా.. ఆచరణ ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపై పట్టణంలో నాలుగేళ్లకుపైగా ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలకు, అక్కడి వారు ఇక్కడికి బదిలీ చేయొచ్చన్న ఆప్షన్‌ను తుంగలో తొక్కుతూ ఈ బదిలీలు జరిగాయన్న టాక్‌ వినబడుతోంది. ఎంజీఎం, సీకేఎం ప్రసూతి హాస్పిటల్‌, హనుమకొండ మెటర్నిటీ హాస్పిటల్‌, టీబీ హాస్పిటల్‌లో పని చేస్తున్న సిబ్బందిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎక్కువ బదిలీలు ఇక్కడిది ఇక్కడే జ రగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్లుగా సర్వీస్‌ చేస్తున్నవారు సిటీకి వచ్చే అవకాశం దక్కకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. స్పెషల్‌ నీడ్‌ చిల్డ్రన్‌ తల్లిదండ్రులకు ఈ బదిలీల్లో ప్రాధాన్యం తీసుకొని వారు కోరుకున్న చోటికి, లేదంటే బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని జీఓ చెబుతున్నా.. అదేది తమకు కాదన్నట్టుగా వరంగల్‌ నగరంలో పనిచేసే ఓ 16 ఏళ్ల స్పెషల్‌ నీడ్‌ చిల్డ్రన్‌ అమ్మా యి తల్లిని న గరం నుంచి 50 కిలోమీటర్ల దూ రంకు బదిలీ చే యడం అవకతవకలకు కేరా ఫ్‌గా నిలుస్తోంది. ఆమె బిడ్డకు అన్నీ తానై చూసుకోవాల్సిన పరి స్థితి ఉన్నా.. ఇ లా బదిలీ చేయ డం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఆర్డర్లూ.. ఆలస్యమే..

మే ఒకటి నుంచి మే 31వ తేదీలోపు అన్ని ప్రభుత్వ విభాగాల బదిలీలు చేయాలంటూ జీఓ నంబర్‌ 38, ఆ తర్వాత జూన్‌ ఒకటి నుంచి ఆరు నెలల పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో బదిలీలపై నిషేధమంటూ జీఓ నంబర్‌ 57ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే జీఓ నంబర్‌ 28ని ప్రత్యేకంగా తెచ్చుకున్న వైద్యారోగ్యశాఖ బదిలీల ప్రస్తావన ఈ జీఓ నంబర్‌ 57లో ఎక్కడా లేకపోవడం బదిలీల పారదర్శకతపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. ఎందుకంటే జీఓ నంబర్‌ 57లో వైద్యారోగ్యశాఖ బదిలీలను మెన్షన్‌ చేస్తూ అందులో ఉండాలని, అలా లేని సందర్భంలో అన్ని విభాగాలకు వర్తించినట్టుగానే ఈ విభాగ బదిలీలపై నిషేధం ఉండాలన్న డిమాండ్‌ వినబడుతోంది. ఇదంతా ఇలా ఉన్నా మళ్లీ జీఓ నంబర్‌ 28ని తీసుకొచ్చి జూన్‌ 6వ తేదీలోపు అన్ని బదిలీలు చేస్తామని చెప్పినా ఇప్పటికీ చాలా మందికి ఆన్‌లైన్‌లో బదిలీల ఆర్డర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుందామంటే ఎర్రర్‌ అనే ఆప్షన్‌ వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సోమవారం బదిలీల ఆర్డర్‌ కాపీ డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. ఆరో తేదీ పేరున ఉండడంతో ఏడు, ఎనిమిది తేదీల్లో ఎక్కడ పనిచేశామనేది.. వారికే తెలియకపోవడం గమనార్హం. అలాగే సంఘాల్లో ఆఫీసు బేరర్లుగా కొనసాగుతూ బదిలీల్లో రిటెన్షన్‌ (మినహాయింపు) కోరిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉండడం గమనార్హం. ఇప్పటికై నా ఈ బదిలీ ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్ది, ఐదుగురు ఐఏఎస్‌ ఆఫీసర్లతో వేసిన కమిటీ ఈ లోటుపాట్లపై చర్చించి అర్హులకు న్యాయం చేయాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యా రోగ్య శాఖ అధికారులను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement