హనుమకొండ జిల్లాకు 12 బస్సులు | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ జిల్లాకు 12 బస్సులు

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

హనుమకొండ జిల్లాకు 12 బస్సులు

మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి

రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందజేత

హన్మకొండ అర్బన్‌: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా హనుమకొండ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం 12 నూతన ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులకు బస్సులు అందజేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ముఖ్యమంత్రి బస్సులు ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని 12 మండలాల నుంచి దాదాపు 600 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఏపీఎంలు, మహిళా పోలీసులు, ఆశ కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. పట్టణ పరిధిలోని కాజీపేట, హనుమకొండ మండలాలు మినహా మిగిలిన మండలాల నుంచి ఒక్కో బస్సులో 50 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యులు వెళ్లారు. బస్సులను ఆయా మండలాల మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్‌ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, వివిధ మండలాల ఏపీఎంలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement