కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్‌లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 70 శాతా నికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్‌లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్‌లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్న ల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు.
నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష
ప్రాజెక్టు పరిధి బరాజ్‌లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్‌కు ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల
బరాజ్‌లలో సాగుతున్న పరీక్షలు
నేడు మేడిగడ్డకు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


