మహిళల భద్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు పెద్దపీట

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

మహిళల భద్రతకు పెద్దపీట

ధర్మసాగర్‌: సమాజంలో మహిళల రక్షణ, భద్రతకు పోలీస్‌ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ధర్మసాగర్‌ మండలం పెద్ద పెండ్యాలలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. మహిళలు, యువతులు సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపులు, వివిధ సమస్యల పరిష్కారానికి పోలీస్‌ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న షీ టీమ్స్‌ ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీస్‌ అధికారులు గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్‌రెడ్డి, ధర్మసాగర్‌ సీఐ శ్రీధర్‌రావు, షీ టీమ్‌ సీఐ సుజాత, ధర్మసాగర్‌ ఎస్సై జానీ పాషా, స్థానిక సర్పంచ్‌ తోట నాగరాజు, ఎంపీడీఓ అనిల్‌కుమార్‌, ఏఓ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement