వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

న్యూశాయంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బొల్లికుంట వాగ్దేవి కశాశాలలో జిల్లా కార్యకర్తల రెండు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడారు. మోదీ మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకుంటున్నారన్నారు. సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, రాణీ రుద్రమదేవి, రాణా ప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement