చేనేత కార్మికుల నిరసన దీక్ష | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల నిరసన దీక్ష

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

టెస్కో ద్వారానే ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్‌

నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

కాశిబుగ్గ: సమస్య పరిష్కారం అయ్యేవరకు తమ ఆందోళన చేస్తామని చేనేత కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కొత్తవాడ గోపాలస్వామి గుడి బస్టాప్‌ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వద్ద వారు నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం టెండర్‌ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని రద్దు చేయాలని, గతంలో మాదిరిగానే టెస్కో ద్వారా కార్పెట్లు, బెడ్‌షీట్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఆదివారం నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం సాక్షిగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామని వారు పేర్కొన్నారు.

మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు..

చేనేత కార్మికులకు పలు పార్టీల నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌, అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లలో టెండర్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడిందని గుర్తుచేశారు. పద్మశాలి సంఘం అఽధ్యక్షుడు ఆడెపు రవీందర్‌, మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌, డాక్టర్‌ వన్నాల వెంకటరమణ, బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు, పద్మశాలి సంఘం నాయకులు వడ్నాల నరేందర్‌, గోరంటల రాజు, బిట్ల అశోక్‌, న్యాయవాది ఎస్‌వీ రామచంద్రయ్య, బేతి అశోక్‌, నీలం రాజ్‌కిశోర్‌, కటకం విజయ్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. సహకార సంఘాల అధ్యక్షుడు డీఎస్‌ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడిగొప్పుల సంపత్‌, యెలుగం వెంకటమల్లు, చిన్న భద్రయ్య, యెలుగం సాంబయ్య, ఓం ప్రకాశ్‌, దూబాల రాజేందర్‌, కొలిపాక మదనయ్య, కూరపాటి సంపత్‌, జయరాం, ఓదెలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement