వరంగల్ లీగల్: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కాళోజీ మార్గ్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా కోర్టు ఆవరణలో మొక్క నాటిన అనంతరం ర్యాలీని జెండా ఊపి న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని మన భవిష్యత్‌తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలను కాపాడుకోవడంతోపాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు కాలుష్యాన్ని నిర్మూలించగలమని వివరించారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు డాక్టర్ టి.శ్రీనివాసరావు, నారాయణబాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేశ్, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ


