మొక్కలతోనే మానవాళి మనుగడ | - | Sakshi
Sakshi News home page

మొక్కలతోనే మానవాళి మనుగడ

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

నెక్కొండ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలతోనే మావనవాళి మనుగడ సాధ్యమని భద్రాద్రి సర్కిల్‌ ఐఎఫ్‌ఎస్‌, చీఫ్‌ కన్వర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డాక్టర్‌ భీమ్లానాయక్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సూరిపల్లిలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై అధికారులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా భీమ్లానాయక్‌ మాట్లాడుతూ చెట్ల పెంపకాన్ని జీవితంలో భాగంగా ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులకు కారణం చెట్ల నరికివేతేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విస్తారంగా అడవులు, పచ్చదనం ఉంటేనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత బోగ, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఏ నరేశ్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఎ.నవీన్‌, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి సర్కిల్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భీమ్లానాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement