కేయూలో ముఖగుర్తింపు హాజరుకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

కేయూలో ముఖగుర్తింపు హాజరుకు అంతరాయం

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

కేయూలో ముఖగుర్తింపు హాజరుకు అంతరాయం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో మొబైల్‌ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (ఫేస్‌ రిక్నగ్నేషన్‌ అటెండెన్స్‌) మొబైల్‌ యాప్‌ సేవలకు అంతరాయం కలిగిందని రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్‌ జారీచేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పనిచేయడం లేదని, ఈనెల 7వతేదీ వరకు మాన్యూవల్‌గా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ, వివిధ కార్యాలయాల్లోని పలు విభాగాల్లో, కళాశాలల్లో డివైస్‌ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు పనిచేస్తోందని, వారు యథావిధిగా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement