ధరల భారం! | - | Sakshi
Sakshi News home page

ధరల భారం!

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సామగ్రి రేట్లు ౖపైపెకి..

నర్సంపేట: పేద, మధ్య తరగతి ప్రజలకు నిలువనీడ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత ప్రతి అసెంబ్లీ నియోజవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. అర్హులను ఎంపిక చేసింది. పెరిగిన ఇళ్ల నిర్మాణ ధరలతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఏమూలకు సరిపోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

మూడు నియోజకవర్గాలకు ఇళ్ల మంజూరు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతుండడం లబ్ధిదారులకు మరింత కష్టాలు తెచ్చి పెట్టింది. ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుకతో పాటు సిమెంట్‌ సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిన ధరకే సామగ్రి కొనుగోలు చేయడంతో లబ్ధిదారుపై ఆర్థిక భారం పడుతోంది. ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు కొంతమంది ముందుగానే అప్పులు చేసి స్థలాన్ని కొనుగోలు చేశారు. నిర్మాణానికి అవసరమైన ఐరన్‌, సిమెంట్‌ ధరలు గతంలో ఉన్న ధరలకు అటు ఇటుగా ఉన్నాయి. మిగిలిన ఇసుక, మట్టి, కంకర, మొరం, కూలి రేట్లు, ఇంటి నిర్మాణంలో వాడే కర్రతో పాటు ఇతర సామగ్రి ధరల పెరుగుదలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోవడం లేదని.. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతోందని వారు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

14,500

19,000

5,500 7,500

సామగ్రి

మట్టి ఇటుకలు (1800 ట్రాక్టర్‌ లోడు)

సిమెంట్‌ ఇటుకలు (ట్రాక్టర్‌ లోడు 300)

నియోజకవర్గం ఇళ్ల మంజూరు బేస్‌మెంట్‌ లెవల్‌ రూఫ్‌ లెవల్‌ ఆర్చి లెవల్‌ పూర్తయిన ఇళ్లు

ఒక్కో గృహానికి రూ.15 లక్షల వరకు ఖర్చు

ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోవడం లేదంటున్న లబ్ధిదారులు

Advertisement
 
Advertisement
Advertisement