ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

పరకాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి

సాయి శరత్‌

పరకాల: పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పరకాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయిశరత్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయి శరత్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీవల్లి శైలజ, న్యాయవాదులు మొక్కలు నాటారు. జడ్జిలు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ద్వారానే మానవాళి మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూకట్ల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పెద్దబోయిన వేణు, న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, గండ్ర నరేష్‌రెడ్డి, మేరుగు శ్రీనివాస్‌, గండ్ర నరేష్‌రెడ్డి, పి.వెంకటరమణ, రాఘవేంద్రశర్మ, లక్కం శంకర్‌, రాహుల్‌ విక్రం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement