హసన్పర్తి: ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించొద్దని డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలం భీమారంలోని స్కిల్స్ స్టార్క్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలకు చెందిన బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. నోట్బుక్లతో పాటు బూట్లు, సాక్స్, బెల్ట్లు, టైలు, యూనిఫాం వంటి వస్తువులను పాఠశాలల్లో విక్రయించొద్దని, వాటి కొనుగోలుకు మూడు దుకాణాలను సూచించాలని తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమకు నచ్చినచోటే వస్తువులను కొనాలన్నారు. సమావేశంలో జిల్లా సీఎంఓ సుమాదేవి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎంఈఓలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నూతనంగా ఈవిద్యాసంవత్సరం 39 ప్రీప్రైమరీ సెక్షన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరగతుల బోధనకు ఇన్స్ట్రక్టర్లను, అదేవిధంగా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒకటి లేదా అంతకన్న ఎక్కువ పాఠశాలలకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక ప్రక్రియలో సంబంధిత పాఠశాల ఉన్న గ్రామం, హ్యబిటేషన్కు చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను నిర్దేశిత దరఖాస్తు నమూనాను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు సమర్పించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 8వరకు గడువు ఉందని తెలిపారు. ఇన్స్ట్రక్టర్ల దరఖాస్తులకు ఇంటర్మీడిఝెట్ విద్యార్హత, లేదా ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్ కోర్సును పూర్తి చేసి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రీప్రైమరీ ఆయా పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు.
డీఈఓ గిరిరాజ్గౌడ్
ప్రైవేట్ పాఠశాలల
యాజమాన్యాలతో సమావేశం


