అదనపు కలెక్టర్ రవి
ఆత్మకూరు: పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతపై సంపూర్ణ నిషేధం ఉందని ఎవరైనా అవశేషాలు కాలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలిపారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, నేల సారవంతం తగ్గిపోతుందన్నారు. అదేవిధంగా భూమిలోని సేంద్రియ పదార్థాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందన్నారు. చట్టపరంగా అన్ని గ్రామాల్లోని పంట క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చేయయడం నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. మండల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే ఏసీపీ సతీశ్‌బాబు మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సంతోశ్, ఎంపీఓ యోగిత, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్వేత, తదితరులు పాల్గొన్నారు.


