ఖానాపురం: సమాజంలోని ప్రతీఒక్కరు ప్లాస్టిక్‌ను నిర్మూలించుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు మండలంలోని పాకాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణ– ప్లాస్టిక్ వాడుక నిషేధంపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో అనేక అనర్థాలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మానవ, జీవరాశుల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకంతో సహజసిద్ధ సరస్సులోని జీవరాశులు అంతరించుపోతున్నాయన్నారు. ప్రతీఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించుకోవాలన్నారు. డీఎఫ్‌ఓ భోగ నిఖిత మాట్లాడుతూ భవిష్యత్ అటవీశాఖ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామన్నారు. అంతకుముందు పాకాలలో బ్యాటరీ ఆటోలో బటర్‌ఫ్‌లై గార్డెన్‌తో పాటు కట్ట, చెరువు అందాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎఫ్‌ఆర్వో నగేష్, డీఆర్వో రీనా, అశోక్‌నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం, మార్కెట్ డైరెక్టర్ సారంగపాణి, బేస్‌క్యాంప్ సిబ్బంది విజయ్, శ్రీకాంత్ ,ప్రకాశ్, రవి, రాజు, నాగరాజు, అటవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి


