హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి విద్యుత్ రంగం వెన్నుముఖ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ అత్యంత కీలకమన్నారు. కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ కంట్రోల్ రూం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసం పత్రాలు అందించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, మాధవ రావు, కె.వెంకట రమణ, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి
వరుణ్ రెడ్డి


