వెలుగుల ఖిల్లా | - | Sakshi
Sakshi News home page

వెలుగుల ఖిల్లా

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

సాక్షి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లా పునర్విభజనలో భాగంగా 13 మండలాలతో ఏర్పడిన వరంగల్‌ జిల్లాలో జలవనరులు సందడి చేస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రభుత్వ వైద్యవసతులు మెరుగవుతున్నాయి. ఫామ్‌ టు ఫైబర్‌ నినాదంతో గీసుకొండ, సంగెం మండలాల్లోని శా యంపేట హవేలీ గ్రామంలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో ప్రపంచ యవనికపై వరంగల్‌ దశదిశ తిరగబోతోంది. ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యా క్చరింగ్‌, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు పెరిగి ఉపాధి పెరుగుతోంది. త్వ రలోనే భూసేకరణ పూర్తయిన మా మునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రారంభంకానుంది. అలాగే రైతుబంధు రాకతో వ్య వసాయ పంటల ఉత్పత్తి పెరిగి రైతులకు లాభదా యకంగా మారింది. పాఠశాలలు, ఇంటర్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు పెరిగి విద్యకు కేరాఫ్‌గా మారింది.

ఆరోగ్య‘మస్తు’గా అడుగులు

● నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ప్రభుత్వ వైద్యాసుపత్రి, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 2024 సెప్టెంబర్‌ 19న ప్రారంభించారు. రూ.183 కోట్ల వ్యయంతో ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

● వరంగల్‌ నగరంలో 19.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల వ్యయంతో 24 అంతస్తుల్లో అత్యాధునిక వైద్య సేవలతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 2022లో నిర్మాణం ప్రారంభమైనా.. వివిధ కారణాలతో ఆలస్యమైన పనులు ఏడాదిన్నరగా వేగం పుంజుకున్నాయి. మరో మూడు నెలల్లో ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సహాయం అందే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంజీఎం ఆస్పత్రిలో లక్షలాది మంది రోగులకు వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.

జలసవ్వడుల దిశగా..

● ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల మరమ్మతులు, పూ డికతీత పనులు ఎక్కువగా అవసరాల మేరకు జరిగేవి. భారీస్థాయిలో చెరువు పునరుద్ధరణ కా ర్యక్రమం లేకపోయింది. పూడిక పేరుకుపోవడంతో జిల్లాలోని ముఖ్యంగా పాకాల వంటి ప్రధాన నీటి వనరుతో పాటు వందలాది చెరువుల్లో పూడికతీత సమస్య పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని 300కుపైగా చెరువుల్లో మిషన్‌ కాకతీయ కింద పూడిక తీశారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా 279 చెరువుల్లో పూడిక తీయడం ద్వారా భూగర్భజల మట్టం పెంచేదిశగా ముందుకెళ్తున్నారు.

దేవాదుల పూర్తయితే దశ తిరుగుద్ది

ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టారు. మూడు దశలకు కలిపి 2005–06లో రూ.6,016 కోట్లకు పరిపాలన అనుమతులివ్వగా, 2025–26 ధరల ప్రకారం రూ.18,400 కోట్లు వ్యయమవుతుందని తేల్చారు. ఇప్పటివరకు రూ.14,422 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తే కానీ పథకం పూర్తి కాదు. మూడు దశల్లో కలిపి 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 58,000 ఎకరాల స్థిరీకరణకు నీరందించాల్సి ఉంది. 2027 డిసెంబర్‌ 31 వరకు ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తే జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరందే అవకాశం ఉంది.

అభివృద్ధి దిశగా ఓరుగల్లు

నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి,

మెడికల్‌ కాలేజీ

24 అంతస్తులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

మిషన్‌ కాకతీయ, ఉపాధి పనులతో

చెరువుల్లో పూడికతీత

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో ఉపాధి ఫుల్‌

Advertisement
 
Advertisement
Advertisement