● ఏసీపీ రవీందర్‌రెడ్డి
దుగ్గొండి: పంట వ్యర్థాలను తగులబెట్టి మట్టిని మాడ్చవద్దని, మంటలకు గాలితోడైతే తీవ్ర ప్రమాదం జరిగి ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని శివాజినగర్, తొగర్రాయి గ్రామాల మధ్యన ఓరైతు మొక్కజొన్న బెండ్లను సోమవారం కాల్చుతున్నారు. ఇంతలోనే గాలిదుమారం మొదలై మంటలు చెలరేగి పక్కనే ఉన్న పౌల్ట్రీఫామ్ వద్దకు చేరుకుంటున్న క్రమంలో అటువైపుగా వెళ్తున్న ఏసీపీ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలోనే కలియదున్నాలయన్నారు. రైతులు ఎవరైన పంట వ్యర్థాలను కాల్చితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సాయిరమణ, ఎస్సై రావుల రణదీర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
నర్సంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ రవీందర్‌రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని మహేశ్వరం గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.


