● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● గ్రీవెన్స్‌లో 173 దరఖాస్తులు
న్యూశాయంపేట: ప్రజా సౌకర్యార్థం జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్ నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా స్థాయిలో 140 దరఖాస్తులు రాగా డివిజన్ స్థాయిలో వరంగల్ నుంచి 22, నర్సంపేట డివిజన్ నుంచి 11 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వీ.గణేశ్, వరంగల్ ఆర్డీఓలు సుమా, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
దివ్యాంగుడైన తనకు ఇంటి స్థలం లేదు. ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఇల్లు ఇప్పిస్తామని ఆశ పెడుతున్నారు. ఇంతవరకు ఇల్లు రాలేదు. ఇందిరమ్మ ఇ ల్లు ఇప్పించడంతో పాటు అంత్యోదయ కార్డు మంజూరు చేసి న్యా యం చేయాలి. – ఎస్.లక్ష్మినర్సింహ, గట్టికల్


