తేలిన లెక్క | - | Sakshi
Sakshi News home page

తేలిన లెక్క

Dec 8 2025 7:32 AM | Updated on Dec 8 2025 7:32 AM

తేలిన

తేలిన లెక్క

న్యూస్‌రీల్‌

వరంగల్‌

రెండు విడతల్లో 16 ఏకగ్రీవాలు

మొదటి విడతలో 11,రెండో విడతలో 5 సర్పంచ్‌లు

రేపు మూడో విడత అభ్యర్థుల ఉపసంహరణ

జోరుగా సాగుతున్న ప్రచారం

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

వరంగల్‌: జిల్లాలోని 317 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఇప్పటి వరకు 16 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 పంచాయతీల్లో 11 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 214 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 800 వార్డుల్లో 214 మంది ఏకగ్రీవం కావడంతో 585 వార్డులకు 1,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11వ తేదీన మొదటి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 117 పంచాయతీల్లో ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడం, సంగెం మండలంలోని ఒక పంచాయతీలో సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ పడక పోవడంతో మిగిలిన 111 సర్పంచ్‌ స్థానాలకు 360 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,008 వార్డుల్లో 97 వార్డులు ఏకగ్రీవం కావడం మరో ఐదు వార్డుల్లో నామినేషన్లు పడక పోవడంతో మిగిలిన 906 వార్డుల్లో 2,142 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 14వ తేదీన రెండో విడత పోలింగ్‌ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా ఈ నెల 9వ తేదీన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల లెక్క తేలనుంది. ఇప్పటికే మూడు విడత ఎన్నికలకు పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు.

వార్డుల్లో ఇలా..

మూడో విడతలో నామినేషన్ల వివరాలు

మండలం సర్పంచ్‌లు పడిన వార్డులు నామినేషన్లు

నామినేషన్లు

చెన్నారావుపేట 30 225 258 729

ఖానాపురం 21 163 184 599

నర్సంపేట 19 145 164 493

నెక్కొండ 39 250 340 818

మొత్తం 109 783 946 2,639

తేలిన లెక్క1
1/1

తేలిన లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement