ఓసీలకు సంక్షేమ పథకాలు అందించాలి
● ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
గోపు జైపాల్‌రెడ్డి
నర్సంపేట: రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, మార్వాడి, కమ్మ, వెలమ కులస్తులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కల్పించాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు చలో రెడ్డి ఫంక్షన్ హాలులో కంది గోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఆ దివారం వరంగల్ ఓసీ సింహ గర్జన బహిరంగ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ఓసీ ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉండాలని, విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి ఆదాయ పరిమితి రూ.8 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు పెంచాలని తెలిపారు. ఓసీ జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పలు డిమాండ్ల ప్రభుత్వానికి ప్రకటిస్తూ 2026 జనవరి 11న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జరిగే హింస గర్జన భారీ బహిరంగ సభకు ఓసీ కులలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్‌రెడ్డి, ఎర్ర యాకుబ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, ఎర్ర జగన్‌మోహన్‌రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వర్లురావు, వడ్డే చిరంజీవి, దుబ్బ శ్రీనివాస్‌గుప్తా, శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా, మేడవరపు కమలాకర్‌రావు, ముడుంబై మాధవాచార్యులు, చకిలం కృష్ణమూర్తి గుప్తా, దుబ్బ రమేష్‌గుప్తా, బండారుపల్లి చెంచా రావు, పల్లె శ్రీనివాస్‌రెడ్డి, దోమకుంట్ల ప్రకాశ్, మద్దెనపెల్లి ఉపేందర్, శింగిరికొండ రవీందర్, బొమ్మనపెల్లి కేశవరెడ్డి, మోతె సంపత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


