మహాజాతర మరో 56 రోజులే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారం సందర్శించి వివరాలు వెల్లడించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే.. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల మేరకు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగట్లేదు.
ఈనెల నుంచే భక్తజనం..
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు సమయం మరో 56 రోజులే మిగిలి ఉంది. ఈనెల రెండో వారం నుంచే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ జాతరకు కనీసం నాలుగైదు నెలల ముందు నుంచి నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈసారి జాతర కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్‌కు రూ. 51.30 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.9.95 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.5.90 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.8.57 కోట్లు.. ఇలా సుమారు 21 శాఖలకు మొత్తం రూ.150 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వంద రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని సీఎం ఉన్నతాధికారులకు పదే పదే సూచించారు. ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారంలో రెండు రోజులు ఈ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికీ మేడారంలో మూడు పర్యాయాలు, హైదరాబాద్‌లో రెండుసార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, క్యూలైన్లు సహా పలు ముఖ్యమైన పనులు మాత్రం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు.
పనుల వేగవంతానికి ఆదేశం..
జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ఆయన జాతర పనులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్ని ప్రధాన పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, మేడారంలో పురోగతిలో ఉన్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీగద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. నిర్మాణంలో విమర్శలకు తావివ్వొద్దు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలిశ్రీ అని సీఎం అధికారులకు సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి, గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఇప్పటికై నా పనుల్లో వేగం పెరుగుతుందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది.
నెల రోజుల ముందు నుంచే
భక్తుల తాకిడి
సుమారు రూ.150 కోట్లతో
కొసాగుతున్న పనులు
సెప్టెంబర్ 23న సీఎం సందర్శన..
వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్‌లో అత్యవసర సమీక్ష.. పనుల తీరుపై సీఎం సీరియస్
మహాజాతర మరో 56 రోజులే!
మహాజాతర మరో 56 రోజులే!


